బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. గడచిన వారంలోనే 10 గ్రాముల బంగారం ధర రూ.7650 దిగి వచ్చింది. తాజాగా 10 గ్రాముల బంగారం రూ.110 తగ్గి 75110కి దిగి వచ్చింది. వెండి ధర కూడా పది రోజుల్లో కిలోకు 11 వేలు తగ్గింది. తాజాగా కిలో వెండి రూ.91100కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2565 అమెరికా డాలర్లకు తగ్గింది.
త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహ పరచడంతో స్టాక్ మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. మరోవైపు బంగారం, వెండి ధరలు ఇప్పటికే గరిష్ఠాలకు చేరుకోవడంతో అమ్మకాలు క్షీణించాయి. దీంతో డిమాండ్ తగ్గి ధరలు దిగివస్తున్నాయి.
అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ట్రంప్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. పాలనా సంస్కరణలతోపాటు చిన్న తరహా పరిశ్రమలకు రాయితీలు ప్రకటించే అవకాశం లేకపోలేదు. జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరవాత తీసుకునే నిర్ణయాలపై స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.