ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఏపీ వ్యాప్తంగా ఆరు చోట్ల కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా నిధులు కూడా కేటాయించింది. ఫీజిబిలిటీ అధ్యయనం కోసం రూ.1.92 కోట్లు విడుదల చేసింది.
కుప్పం, పలాస, నాగార్జునసాగర్ సమీపంలో, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జునసాగర్ సమీపంలో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెం వద్ద 1,123 ఎకరాలు, పలాస వద్ద 1,383 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, అన్నవరంలో 787 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.
నిధులు కేటాయించినందున సాధ్యమైనంత త్వరగా ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తిచేయాలని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.