ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ ఓటమిచెందాడు. టెక్సాస్‌లో జరిగిన బిగ్ బౌట్లో మైక్ టైసన్‌ను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జేక్ పాల్ ఓడించాడు. జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో మైక్ టైసన్ ఓడాడు.
58 ఏళ్ల టైసన్ తనకంటే 37 ఏళ్ల చిన్నోడైన జేక్ సూపర్ పంచ్‌లకు తల్లడిల్లాడు. తొలి రెండు రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం కనబరిచినప్పటకి.. తర్వాతి 8 రౌండ్లలో జేక్ పాల్ మెరుగుపడ్డాడు. గెలిచిన వెంటనే జేక్ పాల్, మైక్ టైసన్‌కు తలదించి నమస్కరించాడు. విజేతగా నిలిచిన బాక్సర్ జేక్ పాల్ కు 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీగా లభించింది.
దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత ప్రొఫెషనల్ రింగ్‌లోకి దిగిన మైక్‌టైసన్ మునుపటి ఉత్సాహం చూపడంలో విఫలం అయ్యాడు. 2005లో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పాడు. బౌట్లో తలపడినందుకు గాను టైసన్ సుమారు రూ.168 కోట్లు, పాల్ దాదాపు రూ.337 కోట్లు పొందనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.