ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించింది. ఆయన గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్మూర్తి నాయుడి ఆరోగ్యం పరిస్థితి దిగజారింది అని తెలియగానే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు తమ అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ పయనం అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కాసేపట్లో హైదరబాద్ కు చేరుకోనున్నారు.
మంత్రి లోకేశ్ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. సినీ హీరో నారా రోహిత్, రామ్మూర్తి నాయుడు కుమారుడే. ఇటీవలే ఆయన వివాహం జరిగింది.
రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత అన్నతో విభేదించి కొంతకాలానికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరం అయ్యారు.