దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలో గత రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 60 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు అంటుకోవడంతో తల్లిదండ్రులు చిన్నారులను తీసుకుని పరుగులు తీశారు. గత రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నాయని అనుమానిస్తున్నారు. యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జరిగిన ఘోరంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఉప ముఖ్యమంత్రిని ఘటనా స్థలానికి పంపించారు. జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్ ఘటన విషయం తెలియగానే ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర చికిత్స అవసరమైన చిన్నారులకు వైద్యం అందించే ఐసీయూ ఏసీ వార్డులో మంటలు చెలరేగడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.