ఏక కాలంలో 12 రాకెట్లు ఫైర్
పినాకా రాకెట్ లాంచర్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.ఆయుధ వ్యవస్థకు చెందిన రేంజ్, కచ్చితత్వం, స్థిరత్వం, ఫైరింగ్ రేట్‌ను నేడు పరీక్షించారు. ప్రొవిజినల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ ట్రయల్స్‌లో భాగంగా ఈ పరీక్షు నిర్వహించారు . పినాకా లాంచర్ల ద్వారా 12 రాకెట్లను ఫైరింగ్ చేసినట్లు డీఆర్డీవో వెల్లడించింది.
పరమశివుడి విల్లును పినాకం అంటారు. ఆ పేరుతో రాకెట్ సిస్టమ్‌ను రూపొందించారు. భారత ఆర్మీ వద్ద ఉన్న రష్యన్ గ్రాడ్ బీఎం-12కు రీప్లేస్‌మెంట్‌గా దీనిని వినియోగించనున్నారు . 1999 కార్గిల్ యుద్ధంలో దీనిని వినియోగించారు. ఎత్తాటి ప్రదేశాల్లోని పాకిస్తాన్ స్థావరాలను ఈ సిస్టమ్ ద్వారా పేల్చివేశారు.
ఆర్మమెంట్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ సిస్టమ్‌ను డెవలప్ చేసింది. మల్టీ బారల్ రాకెట్ సిస్టమ్‌లో రెండు అమరికలు ఉంటాయి. వీటిల్లో ఆరేసి రాకెట్లు అమర్చి కేవలం 44 సెకన్లలోనే వాటిని ఫైర్ చేస్తారు. 700 x 500 మీటర్ల ఏరియాను ఈ ఫైరింగ్ నేలమట్టం చేయగల్గుతుంది. ఇందులో ఉండే బ్యాటరీ మొత్తం 72 రాకెట్లను ఫైర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ వెపన్ సిస్టమ్‌కు డిమాండ్ పెరగడంతో అడ్వాన్స్డ్ టెక్నాలిజీతో దీనిని తయారు చేశారు. విదేశాల నుంచి కూడా ఈ సిస్టమ్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి.