శబరిమల యాత్రీకుల కోసం భారత వాతావరణ శాఖ (IMD) కీలకచర్యలు చేపట్టింది. యాత్రీకుల కోసం స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేసి సమాచారం అందజేస్తోంది. అమర్నాథ్, చార్ధామ్లలో మాదిరి ‘శబరిమల’ యాత్రపై వాతావరణ వ్యవస్థను తీసుకొచ్చింది.
సన్నిధానం, పంబా, నీళక్కల్.. మూడు చోట్ల వర్ష సూచికలు ఏర్పాటు చేయడతో పాటు మూడు రోజుల వాతావరణ సమాచారం భక్తులకు చేరవేస్తోంది. శాశ్వత వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు ఐఎండీ వివరించింది. వాతావరణ శాఖ చర్యలతో యాత్రీకులకు మరింత మెరుగ్గా స్వామి దర్శనం చేసుకునే వీలుంటుంది.
ఇప్పటికే శబరిమలకు సంబంధించి తొలి వాతావరణ బులిటెన్ విడుదల చేసిన ఐఎండీ, ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు చిరుజల్లులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
అయ్యప్ప భక్తుల కోసం ‘‘Swamy AI Chat Bot” యాప్ ను అందుబాటులోకి తెచ్చిన కేరళ ప్రభుత్వం, ఆరు భాషల్లో శబరిమలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తోంది. వాతావరణ సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా తెలియజేసే వీలుంది.