వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లను తయారు చేయాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సైన్యాధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్ సరిహద్దులోకి ప్యాంగ్యాంగ్ సేనలు చేరుకున్న సమయంలో కిమ్ ఆదేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది కిమ్ స్వయంగా ఆత్మాహుతి డ్రోన్ పరీక్షల్లో పాల్గొన్నారు.గత ఏడాది జరిగిన ఘర్షణల్లో దక్షిణ కొరియాపై ఉత్తరకొరియా సైన్యం వదిలిన డ్రోన్లను కూల్చలేక ఆదేశం నానా అవస్థలు పడింది. ఆ తరవాత డ్రోన్ల విధ్వంసక వ్యవస్థను దక్షిణకొరియా ఏర్పాటు చేసుకుంది.
రష్యా తరపున పోరాడేందుకు కిమ్ తన సైన్యాన్ని పంపిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి పొందిన టెక్నాలజీతో కిమ్ సైన్యం ఆత్మాహుతి డ్రోన్లు తయారు చేస్తోందని అనుమానిస్తున్నారు. ఈ డ్రోన్లు లక్ష్యాన్ని చేధించడంలో విజయవంతం అయ్యాయి. ఇప్పటికే పలు పరీక్షల్లో ఆత్మాహుతి డ్రోన్లు విజయవంతంగా పనిచేశాయి.
ఇజ్రాయెల్ ఇరాన్‌పై ప్రయోగించిన డ్రోన్ల టెక్నాలజీని రష్యాకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. రష్యా నుంచి దక్షిణకొరియా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని పెద్ద ఎత్తున ఆత్మాహుతి డ్రోన్లు తయారు చేయాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ యుద్ధంలో ఈ డ్రోన్లు ఉపయోగించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.