ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనకు వెళుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన వెలగపూడి సచివాలయం నుంచి హెలీకాఫ్టర్ ద్వారా గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 3.45 గంటలకు దిల్లీలో అడుగుపెడతారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సీఎంచంద్రబాబు సమావేశమై పలు విషయాలు చర్చిస్తారు.
దిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలతోనూ చంద్రబాబు భేటీ అవుతారు. బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్ళి, ఎన్డీఏ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబరు 20న జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలో శివసేన, ఎన్సీపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ భాగస్వామిగా శివసేన(ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధికారం కోసం పోటీ పడుతున్నాయి.