మేఘాలయ వేర్పాటువాద కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేస్తోన్న హిన్నీవట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ సంస్థను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019 నుంచి ఈ సంస్థ 48 హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు భంగం కలిగించే విధంగా సంస్థ కార్యక్రమాలు ఉన్నాయని, అందుకే ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.
మేఘాలయాలో అత్యధికంగా కాశీ, జైంతియా తెగలు నివసిస్తున్నారు. ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలంటూ హిన్నీవట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ ఉద్యమాలు చేస్తోంది. పెద్ద ఎత్తున నిధులు వసూలు చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని కేంద్రం ప్రకటించింది.
భవిష్యత్తులో పెద్ద ఉగ్ర సంస్థలా తయారయ్యే ప్రమాదముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోంశాఖ ఉపా కింద నిషేధం విధించింది. మేఘాలయలో కాశీ, జైంతియా తెగల ప్రాంతాలను వేరుచేయాలని ఈ సంస్థ పోరాడుతోంది. వేర్పాటువాదం ముసుగులో హింసకు తెగబడుతోంది. దీంతో నిషేధం విధించారు. ఈ నిషేధం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది.