శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం సన్నిధానమ్ శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి , 12 ఏళ్ళ తర్వాత తిరుమల, తిరుపతి పర్యటనకు వచ్చారు. జగద్గురువులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అడిషనల్ ఈవో స్వాగతం పలికారు.
తిరుమల కొండకు బుధవారం సాయంత్రం శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి, శిష్య బృందం సమేతంగా చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో చంద్రమౌళీశ్వర పూజ చేసి అనంతరం అక్కడే బస చేశారు. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాలను సందర్శించారు.
రాత్రికి కూడా కొండపైనే బస చేసి మఠంలో చంద్రమౌళీశ్వర పూజ చేయనున్నారు. శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలోని శృంగేరి మఠానికి వెళతారు. అక్కడి నుంచి సాయంత్రం పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు.