అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్, తన జట్టును ఎన్నుకుంటున్నారు. అనుకూలురు, మద్దతుదారులను కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన ట్రంప్, మాజీ డెమోక్రాట్ లీడర్ తులసీ గబ్బార్డ్ ను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎంపిక చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు విదేశాంగ శాఖ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. అధికార మార్పిడిపై చర్చించేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఆహ్వానంతో వైట్ హౌస్ కు ట్రంప్ వెళ్ళారు.
ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా నియమిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా జాన్ రాట్క్లిఫ్, సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్‌ను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్‌గా, అర్కన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ (69)ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా నియమించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టీవెన్ విట్కాఫ్ను పశ్చిమాసియాకు ప్రత్యేక దూతగా నియమించారు.