ఇప్పటికే మూడు ఘనతలు సాధించిన శ్రీరాముడి జన్మభూమి
శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య పలు రికార్డులు వేదికగా నిలుస్తోంది. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో ఘనత సాధించేందుకే సుగుణాభిరాముడి పుట్టినిల్లు సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం యోగి ప్రభుత్వం , ప్రతీయేటా ‘దీపోత్సవం’ నిర్వహిస్తోంది.
రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించారు. సరయూ నది తీరంలో నిర్వహించిన దీపోత్సవాలు మూడు రికార్డులు సృష్టించింది.
అయోధ్యలోని రామ్ కీ పైడీలో గత అక్టోబరులో 35 వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో 28 లక్షల దీపాలు వెలిగించారు. ఈ ఘటన కేవలం 72 గంటల్లోనే చోటుచేసుకుంది. అక్టోబర్ 30న సాయంత్రాన 1,100 మంది భక్తులు సరయూమాతకు హారతులిచ్చారు. ఈ సమయంలో భక్తులంతా ఒకే రంగు దుస్తులు ధరించి హారతి ఇచ్చారు. నవంబరు 9న సాయంత్రం అయోధ్యలో 35 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణలతో మరో ఘనత సాధించారు. 24 గంటల పాటు ఈ ప్రదక్షణ ఘట్టం సాగింది.
ఈ కోవలోనే రేపు అనగా నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చి, సరయూ నదిలో పుణ్యస్నానాలు చేసి తరించనున్నారు.
ఇందుకోసం జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా నిర్వహించనున్నారు.