రష్యాలో ప్రముఖుల అంతుపట్టని మరణాలు ఆగడం లేదు. గతంలో వ్యాపారులు, జర్నలిస్టులు, ప్రతిపక్షనేతలు సహా అనేక మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పుతిన్‌పై విమర్శలు చేసిన వారు అనుమానాస్పదంగా చనిపోవడంపై పలు సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన సంచలనంగా మారింది.
రష్యాకు చెందిన ప్రముఖ చెఫ్ అలెక్సీ జిమిన్. టెలివిజన్‌లో వంటల కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అనేక పుస్తకాలు కూడా రచించారు. ఇటీవల ఓ తాజా పుస్తక ప్రచార నిమిత్తం సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ వెళ్లారు. అక్కడి హోటల్ గదిలో విగతజీవిలా కనిపించాడు. దీనిపై సెర్భియా అధికారులు ఇంకా వివరాలు అందించలేదు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తరవాత అలెక్సీ మరణంపై వివరణ ఇస్తామని సెర్బియన్ పోలీసులు చెబుతున్నారు
రష్య ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరవాత పుతిన్‌పై విమర్శలు చేసే వారే లక్ష్యంగా అంతమొందిస్తున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. గతంలో ప్రతిపక్షనేత కూడా అనుమానాస్పదంగా చనిపోవడం ప్రపంచ వ్యాప్తంగా పెనుదుమారమే రేగిన సంగతి తెలిసిందే.