లక్ష్యఛేదనలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో సూర్యసేన 2-1ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన నాలుగో మ్యాచ్ శుక్రవారం జరగనుంది. సెంచూరియన్ సూపర్ స్పోర్ట్స్ పార్క్
వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో టాస్ గెలిచిన సఫారీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ పేసర్ అవేశ్ ఖాన్ స్థానంలో రమణ్ దీప్ అవకాశం కల్పించింది.
బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులతో బరిలోకి దిగిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 పరుగులు చేయగా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 56 బంతుల్లో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో అదరగొట్టాడు. ఓపెనర్ సంజూశాంసన్ మరోసారి డకౌట్ అయ్యాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ కు దిగిన తిలక్ వర్మ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తన ప్రతిభ నిరూపించుకున్నాడు. 32 బంతుల్లో అర్థ సెంచరీ చేయడంతో పాటు మరో 19 బంతుల్లో శతకం కొట్టాడు.
సూర్యకుమార్ యాదవ్(1)సిమిలానె బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. హార్దిక్ (18)ను కేశవ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. రింకూసింగ్(8) బౌల్డ్ అయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రమణ్ 15 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. అక్టర్ పటేల్ (1*)గా ఉన్నాడు.
చిన్న వయస్సులోనే అంతర్జాతీయ టీ20ల్లో శతకం కొట్టిన ఆటగాళ్ళ స్థానంలో తిలక్ రెండో స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా జట్టు లక్ష్య ఛేదనలో పోరాడి ఓడింది. ఏడు వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసి ఓడింది. పది ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 84 పరుగులు చేసిన సఫారీ జట్టు, ఆ తర్వాత పుంజుకుంది. కానీ చివరి వరకు పోరాట పటిమ కొనసాగించలేకపోయింది. రికిల్ టన్(20), హెండ్రిక్స్ (21), స్టబ్స్ (12), మార్ క్రమ్ (29)తో స్కోర్ బోర్డు వేగం పెంచారు. క్లాసెన్(41), యాన్సెన్(54)పోరాడారు. కొయెట్జీ(2), సిమిలానె (5)నాటౌట్ గా ఉన్నారు.
భారత బౌలర్లలో అర్ష్ దీప్ మూడు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.