దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లో వక్ఫ్ బోర్డు ఆస్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దానివల్ల జనాభా పరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా తలెత్తే పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు పలు ప్రాంతాలను తమ ఆస్తులుగా ప్రకటిస్తుండడం ఆ ప్రాంతపు మత, సాంస్కృతిక ఉనికిని దెబ్బతీస్తోంది. దానివల్ల సమీప భవిష్యత్తులో సామాజిక, రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశముంది.
ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ 2003లో ఏర్పాటైంది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ నుంచి ఉత్తరాఖండ్ బోర్డు వాటాకు వచ్చిన ఆస్తులు 2078. వాటిలో మసీదులు, మదరసాలు, శ్మశానాలు, మతపరమైన ఇతర సంస్థలు చాలా ఉన్నాయి. అయితే వాటి బదలాయింపు ఇంకా పూర్తి కాలేదు. 450 స్థలాలకు చెందిన డాక్యుమెంట్లను యూపీ వక్ఫ్ బోర్డ్ ఇప్పటివరకూ విడుదల చేయలేదు. దాంతో వాటి యజమాన్యంపైనా, నిర్వహణ పైనా వివాదాలు నెలకొన్నాయి.
21సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2024లో ఉత్తరాఖండ్‌లో వక్ఫ్ భూములు రెట్టింపు కంటె ఎక్కువ పెరిగాయి. ఇప్పుడు మొత్తం 5183 ఆస్తులను వక్ఫ్‌బోర్డు లిస్ట్ చేసింది. వాటితో పాటు మరో 205 ఆస్తుల విషయంలో స్థానిక కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా వక్ఫ్ ఆస్తులు గణనీయంగా పెరిగిపోవడం, ఉత్తరాఖండ్ రాజకీయ, సాంస్కృతిక వాతావరణంలో పెచ్చుమీరుతున్న ప్రమాదకర మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా, వారి ప్రభావం ఆందోళనకరంగా పెరుగుతున్నాయనడానికి ఈ వక్ఫ్ ఆస్తుల పెరుగుదలే నిదర్శనంగా ఉంది.
ఈ వక్ఫ్ ఆస్తుల పెరుగుదలలోనూ ఒక ట్రెండ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పర్వత ప్రాంతాల్లో మసీదుల సంఖ్య పరిమితంగానే ఉంది. ఉదాహరణకు చమోలీ, రుద్రప్రయాగ, ఉత్తరకాశీల్లో ఒక్కొక్క మసీదు మాత్రమే ఉన్నాయి. తెహ్రీ, పౌఢీ, అల్మోరా, బాగేశ్వర్, పితోరాగఢ్ జిల్లాల్లో మసీదుల సంఖ్య ఒక మోస్తరుగా ఉంటే, శ్మశానాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జనాభా ఎక్కువ ఉండే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరోలా ఉంది. నైనిటాల్, హరిద్వార్, డెహ్రాడూన్ వంటి జిల్లాల్లో మసీదుల సంఖ్య బాగా పెరిగింది. ఒక్క హరిద్వార్‌లోనే వక్ఫ్ బోర్డు కింద 322 మసీదులు ఉన్నాయి. డెహ్రాడూన్, ఉద్ధంసింగ్ నగర్‌లలోనూ అదే పరిస్థితి.
ఇవి కాకుండా ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ కింద 12 మదరసాలు, 70 ఈద్గాలు, 32 ఇమాంబరాలు, 1024 ఇళ్ళు, 1711 దుకాణాలూ ఉన్నాయి. ఇంకా వ్యవసాయ భూములు, ఇళ్ళస్థలాల సంఖ్య సరేసరి. ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుదలకు, వారి ప్రభావానికీ ఈ సంఖ్యలే తార్కాణంగా నిలుస్తున్నాయి.
అంతేకాదు, వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ అవని ఆస్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ అయిన మదరసాలు 100 ఉంటే, మదరసా బోర్డ్‌లో రిజిస్టర్ అయిన వాటి సంఖ్య 400 ఉంది. అలాగే వక్ఫ్ బోర్డ్‌లో 201 మజారాలు (ముస్లిం సాధువుల సమాధులు) లిస్ట్ అయి ఉన్నాయి. ఆ మదరసాలు, మజారాల్లో కొన్ని మసీదులుగా మారుతున్నాయి. అవేవీ అధికారిక రికార్డుల్లో నమోదు కాలేదు.
ఈ ఆక్రమణల వెనుక లాండ్ మాఫియా, స్థానికంగా ప్రభావం చూపగల నాయకుల హస్తం ఉన్నాయి. భూముల నిర్వహణలో అవకతవకలు, అక్రమంగా భూములు ఆక్రమించుకుంటున్న వ్యవహారాలూ చాలా ఉన్నాయి. వాటికి తోడు, ప్రభుత్వ భూముల మీద ఆకుపచ్చ గుడ్డ కప్పేసి అవి వక్ఫ్ ఆస్తులు అని చెప్పుకుంటూ అక్రమంగా ఆక్రమిస్తున్నవి, లేదా దుర్వినియోగం చేస్తున్నవి ఎన్నున్నాయో లెక్క తెలీదు.
హిందువులు దేవభూమి, భూతల స్వర్గం అని పిలుచుకునే ఉత్తరాఖండ్‌లో అత్యంత వేగంగా పెరిగిపోతున్న వక్ఫ్ ఆస్తుల సంఖ్య, ముస్లిం జనాభా స్థానిక ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నాయి. మసీదులు, మదరసాలు, ఇతర ఇస్లామిక్ వ్యవస్థల పెరుగుదల వెనుక ఆ ప్రాంతపు జనాభానూ, సంస్కృతినీ మార్చివేసేందుకు వ్యూహాత్మకంగా జరుగుతున్న కుట్ర అన్న భయాందోళనలు కలుగుతున్నాయి.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు