మానవ హక్కుల కమిషన్ (HRC), లోకాయుక్త కమిషన్ లను అమరావతి నుంచి తరలించే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ లను అమరావతిలోనే ఉంచుతామని కూటమి ప్రభుత్వం తెలిపింది. అందుకు అవసరమైన చట్టసవరణ చేస్తామని పేర్కొంది.
హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై మద్దిపాటి శైలజ , ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదించారు. తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది.