తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పరిధిలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. మరమ్మతులు చేపట్టిన రైల్వే శాఖ, 31 రైళ్లను దక్షిణ మధ్య సర్వీసులు రద్దు చేసింది. మరో 10 సర్వీసులను పాక్షికంగా రద్దు చేసింది.
కర్ణాటకలోని బళ్ళారి నుంచి యూపీలోని ఘజియాబాద్‌కు స్టీల్‌లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు రాఘవాపూర్ వద్ద అర్ధరాత్రి సమయంలో అదుపుతప్పింది. దీంతో 11 బోగీలు అదుపు తప్పి ట్రాక్ పై పడిపోయాయి. 44 బోగీలతో వెళ్తున్న ఈ రైలు అధిక లోడుతో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం కారణంగా మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి.
నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్, కాచిగూడ-నాగర్‌సోల్, కాచిగూడ-కరీంనగర్, సికింద్రాబాద్-రామేశ్వరం, సికింద్రాబాద్-తిరుపతి, ఆదిలాబాద్-పర్లి, అకోలా-పూర్ణ, ఆదిలాబాద్-నాందేడ్, నిజామాబాద్-కాచిగూడ, గుంతకల్లు-బోధన్ రైలు సర్వీసులు రద్దు అయ్యాయి.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు.