ఆంధ్రప్రదేశ్ లో పాలక పక్షంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, శాసనసభ, శాసనమండలి లో కీలక పదవులు భర్తీ చేసింది. ఉభయ సభలకు సంబంధించిన చీఫ్ విప్ లు, విప్ లను నియమించింది. శాసనసభలో 15 మంది విప్ లు, మండలిలో ముగ్గురిని విప్ లు గా నియమించింది.
అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులును నియమించిన ప్రభుత్వం , శాసనమండలిలో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధను ఎంపిక చేసింది.
శాసనసభలో కూటమి తరఫున విప్‌లు…
1. బొండా ఉమ (టీడీపీ)
2. కాలవ శ్రీనివాసులు (టీడీపీ)
3. యార్లగడ్డ వెంకట్రావు (టీడీపీ)
4. ఆదినారాయణరెడ్డి (బీజేపీ)
5. బొమ్మిడి నాయకర్ (జనసేన)
6. బెందాళం అశోక్ (టీడీపీ)
7. రెడ్డప్పగారి మాధవి (టీడీపీ)
8. అరవ శ్రీధర్ (జనసేన)
9. తంగిరాల సౌమ్య (టీడీపీ)
10. దాట్ల సుబ్బరాజు (టీడీపీ)
11. దివ్య యనమల (టీడీపీ)
12. పీజీవీఆర్ నాయుడు (టీడీపీ)
13. తోయక జగదీశ్వరి (టీడీపీ)
14. బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
15. వీఎం థామస్ (టీడీపీ)
శానసన మండలిలో టీడీపీ, జనసేన విప్ లు…
1. వేపాడ చిరంజీవి (టీడుపీ)
2. పి.హరిప్రసాద్ (జనసేన)
3. కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)
డిప్యూటీ స్పీకర్ గా….
శాసనసభలో కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ కోసం అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకత్వంతో విభేదించారు. వైసీపీ పాలనలో రాజద్రోహం కేసు నమోదైంది. పోలీసు విచారణలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సైకిల్ గుర్తు పై ఉండి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.