స్టాక్ సూచీలు భారీ నష్టాలను నమోదుచేశాయి. త్రైమాసిక ఫలితాలు విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంటును దెబ్బతీశాయి. భారీగా అమ్మకాలకు దిగడంతో స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 820 పాయింట్ల నష్టంతో 78675 వద్ద ముగిసింది. నిఫ్టీ 257 పాయింట్ల నష్టంతో, 23888 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.రిలయన్స్, ఐసిఐసిఐ,ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
ముడిచమురు ధరలు దిగివచ్చాయి. క్రూడాయిల్ బ్యారెల్ 72.29 యూఎస్ డాలర్లకు తగ్గింది. డాలరుతో రూపాయి మారకం జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 84.45కు దిగజారింది. బంగారం ధరలు దిగివచ్చాయి. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2599 అమెరికా డాలర్లకు దిగివచ్చింది.
విదేశీ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగారు. త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించిన విధంగా అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.