అభివృద్ధిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీహెచ్డీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చంద్రాపూర్ సభలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో గడచిన రెండు సంవత్సరాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.
దేశంలో ఏక్కడా లేని విధంగా అత్యధిక విదేశీ పెట్టుబడులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందన్నారు. 12 వందేభారత్ రైళ్లు మహారాష్ట్రలో పరుగులు పెడుతున్నాయన్నారు. మహారాష్ట్రలో 100 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించామని గుర్తుచేశారు.
అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా మంచి పాలన అందించిందన్నారు. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధిలో మహారాష్ట్ర దూసుకెళుతుందని మోదీ చెప్పారు.రాష్ట్రంలోని ఆదివాసీలను చీల్చి విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ప్రధాని ఘాటు విమర్శలు చేశారు.