ఈ నెల 22 వరకు సమావేశాలు
బడ్జెట్ పై ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీ హాలులో శిక్షణ ఉంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మీడియాతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్నారు. శనివారం కూడా సభ ఉంటుందన్నారు. అవసరమైతే బిల్లులు, చర్చలకు అనుగుణంగా రెండు పూటలా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మాజీ సీఎం జగన్, అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం ఎమ్మెల్యేల బాధ్యత అని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. చీఫ్ విప్, విప్‌లను మంగళవారం ఖరారు చేస్తామన్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు