దర్శకుడు రాంగోపాల్‌వర్మపై కేసు నమోదైంది. ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వ్యూహం చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రాంగోపాల్‌వర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామలింగం
ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాంగోపాల్ వర్మపై కేసు నమోదుపై పోలీసులు స్పందించాల్సి ఉంది. విచారణకు పిలిచే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పలు కేసులు నమోదు చేయడంతోపాటు కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్, వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రా రెడ్డి, అశోక్ రెడ్డి, గుంటూరుకు చెందిన హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.