కర్ణాటకలోని కార్వార్‌లో ఆదివారం ఒక వ్యాపారి తను అమ్మే కూరగాయల మీద ఉమ్మి వేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని స్థానికులు అబ్దుల్ హసన్ సాబ్ రజాక్‌గా గుర్తించారు.
ఆదివారం ఉదయం కార్వార్‌లోని కూరగాయల సంతలో వెడుతున్న ఒక వ్యక్తి అబ్దుల్ రజాక్ చేష్టలను గమనించి, వాటిని వీడియో తీసాడు. దాంతో స్థానికులు అక్కడ గుమిగూడి నిరసన తెలియజేసారు. కూరగాయల పరిశుభ్రతను పాడు చేస్తున్నాడని, అతని చర్య వల్ల ఆ కూరగాయలు కొనేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనీ, వ్యాధులు వ్యాపిస్తాయనీ ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసారు.
అబ్దుల్ రజాక్ తన మీద చేసిన ఆరోపణలను నిర్మొహమాటంగా ఖండించాడు. అయితే అతని చర్యలను ప్రత్యక్షంగా చూసినవారు, అబ్దుల్ రజాక్ కూరగాయల మీద నీళ్ళు చల్లే సమయంలో వాటిని హలాల్ చేయడానికి వాటి మీద ఉమ్మి వేసాడని సాక్ష్యమిచ్చారు.
అబ్దుల్ రజాక్ కూరగాయల మీద ఉమ్మి వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు అతని చర్య చాలా అసహ్యకరంగా ఉందంటూ మండిపడ్డారు.
ఇలా ఆహార పదార్ధాలను కలుషితం చేసే చర్యలను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చే యోచనలో ఉంది. ఆహార పదార్ధాలపై ఉమ్మివేయడం లేదా మూత్రం విసర్జించడం వంటి చర్యల ద్వారా వాటిని హలాల్ చేసే పేరిట ముస్లిం విక్రేతలు కలుషితం చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో చాలాఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఆహార పదార్ధాలను కొనుగోలు చేసే వ్యక్తుల ఆరోగ్యం, పరిశుభ్రత మీద ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.