తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిరసన సెగ తగిలింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో జనం తిరగబడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ప్రతీక్‌జైన్‌పై జనం రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూ సేకరణకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గ్రామసభలు ఏర్పాటు చేశారు. ఆరు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. లగచర్ల గ్రామంలో గ్రామసభలో వికారాబాద్ కలెక్టర్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు మాకు వద్దంటూ జనం నినాదాలు చేశారు.
అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. జనం కర్రలు, రాళ్లతో వెంట పడ్డారు. అధికారులు, కలెక్టర్ కార్లలో ఎక్కి వేగంగా వెళ్లే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కలెక్టర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికుల దాడి నుంచి అధికారులు క్షేమంగా బయటపడ్డారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు