బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ కు వెన్నెముక వంటి వ్యవసాయరంగాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు . రాష్ట్ర జనాభాలో 62 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. సంక్షేమం, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2024-25 వార్షిక బడ్జెట్ లో మొత్తం రూ. 8564.37 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయ రుణాల కోసం 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.2,64,000 కోట్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో పంట రుణాలు కింద రూ. ఒక లక్షా 66 వేల కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కింద రూ. 98 వేల కోట్లు అందించనున్నట్లు ప్రతిపాదించారు.
అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పంట రుణాలు , ప్రభుత్వ సంక్షేమపథకాలు అందజేసేందుకు కౌలుదారు గుర్తింపు కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన సాగుదారుల హక్కు చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.
రూ. 3లక్షల వరకు పంట రుణాలు పొంది, నిర్ణీత వ్యవధి అనగా ఒక ఏడాదిలో తిరిగి చెల్లించే రైతులకు 2024-25 నుంచి వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు..