2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి 2, 94, 427.25కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ వ్యయం రూ. 2,35, 916.99 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇక, మూల ధన వ్యయం 32, 712.84 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34, 743.38 కోట్ల రూపాయలు, ద్రవ్య లోటు 68, 742.65 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి లో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది. 2024-25 ఏడాదికి గానూ పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయలు కేటాయింపును మంత్రి ప్రతిపాదించారు. పోలీసు శాఖకు రూ. 8,495 కోట్లు కేటాయించారు.
శాఖల వారీ కేటాయింపులు …