కెనడాలో ఇద్దరు ఖలిస్థాన్ వేర్పాటువాదులను అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లు మాత్రం ప్రకటించలేదు. అరెస్టైన వారిలో ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడు
అర్ష దీప్సింగ్ ఆలియాస్ అర్ష దల్లా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇతనిపై అనేక కేసులున్నాయి. భారత్ నుంచి 2020లో కెనడా పారిపోయిన అర్ష దల్లాపై పంజాబ్లోని మోగా జిల్లాలో హత్యలు, కిడ్నాప్, బెదిరింపు కేసులున్నాయి. పలు మాదకద్రవ్యాల వినియోగం కేసులు కూడా నమోదయ్యాయి.
తాజా అర్ష దల్లా అరెస్టయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.గత నెలలో ఒంటారియో ప్రావిన్స్ మిల్టన్ ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో అర్ష దల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు ఖలిస్థాన్ వేర్పాటు వాదిని అరెస్ట్ చేసినట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే వారి వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కెనడాలో హిందూ దేవాలయాలు, భక్తులపై ఖలిస్థాన్ వేర్పాటు వాదులు దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. కెనడాలో భారతీయ కాన్సులేట్ క్యాంపులను కూడా రద్దు చేశారు.