సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. కొత్త సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చే ఏడాడి మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవిలో కొనసాగనున్నారు.
న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో జస్టిస్ సంజీవ్ కన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తీర్పును వెలువరించారు. 2019 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ కన్నా 117 తీర్పులను ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. ఈవీఎంపై వచ్చిన అనుమానాలను వ్యతిరేకిస్తూ తీర్పు వెలువరించారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు.