బెజవాడ కనకదుర్గమ్మ భవానీ దీక్షలు రేపటి నుంచి ప్రారంభమై డిసెంబరు నెల 25 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో ప్రకటించారు. నవంబరు 11వ తేదీ సోమవారం భవానీల మండల దీక్షలు ప్రారంభిస్తారు. 15వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున మండల దీక్షలు సమాప్తం అవుతాయి. డిసెంబరు 1న అర్థ మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 5న భవానీ అర్థమండల దీక్షలు పరిసమాప్తం కానున్నాయి.
డిసెంబరు 14న మార్గశిర పౌర్ణమినాడు రాత్రి కలశ జ్యోతి ఉత్సవం నిర్వహిస్తారు.అనంతరం నగరోత్సవం నిర్వహించనున్నారు. డిసెంబరు 21 నుంచి 25 వరకు భవానీల దీక్షల విరమణతోపాటు, అగ్ని ప్రతిష్ఠాపన, శతచండీయాగం నిర్వహించనున్నారు. డిసెంబరు 25తో మహా పూర్ణాహుతితో దీక్షలు ముగిస్తారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా డిసెంబరు 21 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.యస్. రామారావు వెల్లడించారు.