మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా‘సంకల్ప్ పత్ర’ పేరిట ఎన్నికల వాగ్దానాలను ప్రజలు ముందు ఉంచారు. బీజేపీ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్న అమిత్ షా, యువకులు, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించామన్నారర. బీజేపీ కూటమిని గెలిపిస్తే స్కిల్ సెన్సస్, స్టార్టప్‌ల అభివృద్ధి కోసం శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్లు, వడ్డీ లేని రుణాలు అందిస్తామని వాగ్దానం చేశారు.
ప్రతిపక్ష మహా వికాస్ అఘాడిపై అమిత్ షా తీవ్రవిమర్శలు గుప్పించిన అమిత్ షా, కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ అనుమతించదన్నారు. మహారాష్ట్రలో సుస్థిరమైన, విశ్వసనీయమైన పరిపాలన ఉండాలంటే మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని కోరారు.
బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని హామీలు..
యువతకు సుమారు 25 లక్షల ఉద్యోగాల కల్పన
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల డిమాండ్‌కు తగినట్లుగా నైపుణ్యాల పెంపు
లఖపతి దీదీ పథకం 50 లక్షల మంది మహిళలకు విస్తరింప చేయడం
ఎరువులపై జీఎస్టీ వాపసు
పరిశ్రమల వృద్ధికి రూ.25 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు
వ్యవసాయ రుణాల మాఫీ
వృద్ధులకు అందించే నెలవారీ పింఛను రూ.1,500 నుంచి రూ.2,100కు పెంపు
288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న పోలింగ్ జరగనుంది. మహాయుతి కూటమి(బీజేపీ, ఎన్సీపీ,శివసేన), మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్,ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ))కూటమిల మధ్య పోటీ ఉంది.