పులివెందుల పోలీసుస్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు
వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి పై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే అర్జున్‌రెడ్డి, ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకున్న వర్రా రవీందర్‌రెడ్డిపై కూడా కేసు నమోదైనట్లు పులివెందుల పట్టణ పోలీసులు వెల్లడించారు.
టీడీపీ నేతపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లుగా రవీందర్‌రెడ్డి పై కేసులు నమోదు అయ్యాయి.
అసభ్యకరమైన పోస్టులో విషయంలో వర్రాను ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు హరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.