ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పెద్దపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బయటకు అడుగుపెట్టేందుకు స్థానికులు భయపడుతున్నారు.
పెద్దపులి సంచారం పై సమాచారం అందుకున్న అటవీ అధికారులు, గాలింపు చర్యలు చేపట్టారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాశీబుగ్గ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఏ.మురళీకృష్ణ సూచించారు.ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు తెలిపారు.
శ్రీకాకుళంజిల్లా సంతబొమ్మాళి మండలం పెద్దతుంగాం లో ఓ పెద్ద ఎలుగుబంటి, రెండు పిల్ల ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. నివాసాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశాయి. స్థానికులు అడ్డుకోవడంతో గ్రామదేవత ఆలయంలో తిష్ఠ వేశాయి. అనంతరం గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని వాటిని కొండపైకి తరిమారు.