ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. నీట్ శిక్షణ కోసం ఓ కోచింగ్ కేంద్రంలో చేరిన విద్యార్థినిపై అక్కడే పనిచేస్తోన్న ఇద్దరు కామోన్మాధులు అత్యాచారానికి పాల్పడ్డారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో నీట్ శిక్షణ అందించే ఉపాధ్యాయలు సాహిల్ సిద్దిఖీ, వికాస్ ఓ విద్యార్థిని తమ ప్లాటుకు ఆహ్వానించారు. చాలా మంది ఈ వేడుకకు వస్తున్నారని వారు చెప్పారు. తీరా విద్యార్థిని అక్కడకు వెళ్లే సరికి సాహెల్ ఒక్కడే ఉన్నాడని, కూల్ డ్రింకులో మత్తు కలిపి అత్యాచారం చేశాడని బాధితులు పోలీసులకు తెలిపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం యూపీలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
నూతన సంవత్సర వేడుకల పేరుతో యువతిపై ఉపాధ్యాయుడు సాహెల్ అత్యాచారానికి ఒడిగట్టాడని, బయటకు చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందని ఇన్నాళ్లూ బాధితురాలు ఎవరీకీ చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఇటీవల సాహెల్ మరో విద్యార్థినిని కూడా ఇలాగే చేసిన వీడియో వైరల్ కావడంతో, బాధితురాలు తల్లికి విషయం వెల్లడించింది. దీంతో వారు కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరు నెలలపాటు బంధించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆరు నెలలపాటు ప్లాటులో బంధించి అత్యాచారం చేసి, వీడియోలు చిత్రీకరించిన సాహెల్కు వికాస్ తోడయ్యాడు. ఇద్దరూ అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.