దేశీయంగా ఉల్లి ధర పెరగడంతో వినియోగదారులు అల్లాడుతున్నారు. రెండురోజుల కిందట వరకు హోల్‌సేల్ మార్కెట్లలో రూ.40 నుంచి రూ.60 పలికిన కిలో ఉల్లిపాయల ధర ఇప్పుడు రెట్టింపు అయింది. కొన్ని మార్కెట్లలో రూ.70 నుంచి 80వరకు అమ్మకం జరుగుతోంది.
కొన్ని ప్రాంతాల్లో రూ.80 కంటే అధిక ధర కూడా పలికింది. ద్రవ్యోల్బణానికి తోడు సరుకు కొనుగోలు ధరలు పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
మండీల్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగింది.ధర పెరుగుదల విక్రయాలపై ప్రభావం చూపింది. రోజువారీ ఆహారంలో ఉల్లి అవసరం తప్పనిసరి కావడంతో సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లితోపాటు వెల్లుల్లి, ఇతర ఆహార పదార్థాల ధర కూడా రెట్టింపు కావడంతో కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని గృహిణీలు చెబుతున్నారు.