తిరుమల, తిరుపతి దేవస్థానం మాదిరిగా శ్రీశైలక్షేత్రం అభివృద్ధికి మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ లో ప్రయాణించిన చంద్రబాబు శ్రీమల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీశైలంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రం అభివృద్ధి కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, ఆనం రాంనారాయణరెడ్డి, దుర్గేశ్, జనార్దన్ రెడ్డి, జిల్లా అధికారులు సభ్యులుగా కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి నివేదిక అందజేయాలన్నారు. నల్లమలలో టైగర్ సఫారి చేయగలిగితే పర్యాటక రంగానికి ఊతమొస్తుందన్నారు. తిరుపతి మాదిరిగా సున్నిపేటను నివాస ప్రాంతంగా మార్చి వసతులు కల్పించాలన్నారు.
రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉంటే పరిశ్రమలు, పర్యాటక రంగం, ఆధ్యాత్నిక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దీంతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సోషల్ మీడియాలో తప్పులు పోస్టింగులు పెడితే పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.