ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపర్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆస్ట్రేలియా టుడే ఎడిటర్ జితార్థ్ జై భరద్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, కెనడాల్లో పన్నూ ఫోటోలతో వార్తలు కవర్ చేసిన తరవాత, తమపైకి వేర్పాటు వాదులను ఉసిగొలుపుతున్నాడని ఆయన చెప్పారు. కెనడాలో భారత విదేశాంగ మంత్రి జై.శంకర్ ప్రెస్ మీట్ కవర్ చేయడంతో ఆ దేశంలో ఆస్ట్రేలియా టుడేను నిషేధించారని గుర్తుచేశారు.
నిజాయితీతో కూడిన తమ గొంతుకను ఎవరూ నొక్కలేరని ఆస్ట్రేలియా టుడే ఎడిటర్ స్పష్టం చేశారు. బెదిరింపులకు భయపడకుండా తమ లక్ష్యాలను చేరుకుంటామని ఆయన తెలిపారు. కెనడాలో తమ డిజిటల్ మీడియా హ్యాండిల్ళను కెనడా నిలిపివేసిందని గుర్తుచేశారు.
ఎన్ని బెదిరింపులు వచ్చినా ఖచ్ఛితత్వంతో కూడిన కథనాలు అందిస్తూనే ఉంటామని జితార్థ్ తెలిపారు. ఆస్ట్రేలియా టుడేపై కెనడా నిషేధించడాన్ని భారత్ ఖండించింది. వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడటంతో కెనడా మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించింది.