నిర్మాణ రంగ కార్మికుల కొరతతో ముందుకు సాగని పనులు
అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. శిఖర పనులు పూర్తి చేసేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మెన్ న్రుపేంద్ర మిశ్రా తెలిపారు. గతంలో నిర్ణయించిన మేరకు 2025 జూన్‌లో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నిర్మాణ కార్మికుల కొరతతో సెప్టెంబర్ 2025 సమయం పడుతుందన్నారు. సుమారు 200 మంది కార్మికుల కొరత ఉందని పేర్కొన్నారు.
ఆలయంలోని మొదటి అంతస్థులో పెట్టాల్సిన బండలకు చెందిన పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆలయ పరిసరాల్లోని ఆడిటోరియం, బౌండరీ ఇంకా నిర్మించాల్సి ఉందన్నారు. ఆలయ నిర్మాణ పురోగతి పై కమటీ సమావేశమై చర్చించింది.
ప్రహారీ కోసం 8.5 లక్షల క్యూబిక్ అడుగుల విస్తీర్ణంలో, బాన్సి పహర్‌పుర్ స్టోన్స్ వినియోగించనున్నారు , ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన చోట సరిగా లేని రాళ్లను తీసి, వాటి స్థానంలో మక్రానా స్టోన్స్ వేయనున్నట్లు తెలిపారు.
ఆలయంలో పొందుపరిచే అన్ని విగ్రహాలను జైపూర్‌లో తయారు చేస్తున్నారు. డిసెంబర్ చివరికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. రామ్‌లల్లాకు చెందిన మరో రెండు విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ప్రతిష్టించనున్నారు. ఆలయం నుంచి బయటకు వెళ్లేదారిని వెడల్పు చేయనున్నారు.