Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

జమాతే ఇస్లామీ మద్దతుతోనే ప్రియాంక పోటీ: పినరయి విజయన్

Phaneendra by Phaneendra
Nov 9, 2024, 11:08 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇండీ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ సిపిఎం, వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపయెన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంలేని సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం నేత పినరయి విజయన్ కాంగ్రెస్‌పై తన దాడిని ఉధృతం చేస్తున్నారు.  వయనాడ్ ఉపయెన్నికలో, ముస్లిం సంస్థ జమాతే ఇస్లామీ మద్దతుతోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారని పినరయి విజయన్ మండిపడ్డారు.  

పినరయి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వయనాడ్ ఉపయెన్నిక కాంగ్రెస్ సెక్యులర్ ముసుగును పూర్తిగా తొలగించిందని వ్యాఖ్యానించారు. ‘‘జమాతే ఇస్లామీ మద్దతుతోనే ప్రియాంకా గాంధీ వయనాడ్‌లో అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మరి, కాంగ్రెస్ వైఖరి ఏంటి?జమాతే ఇస్లామీ గురించి మన దేశానికి తెలియనిదేమీ లేదు. ఆ సంస్థ సిద్ధాంతాలు ప్రజాస్వామిక విలువలతో కలుస్తాయా?’’ అని ప్రశ్నించారు.

ఈ దేశానికి కానీ, ఈ దేశపు ప్రజాస్వామ్యానికి కానీ జమాతే పూచికపుల్లంత విలువైనా ఇవ్వదని పినరయి విజయన్ గుర్తుచేసారు. ‘‘ఈ దేశపు పరిపాలనా వ్యవస్థను జమాతే బేఖాతరు చేస్తుంది. వెల్ఫేర్ పార్టీ అనే రాజకీయ పక్షపు ముసుగుతో ఈ దేశపు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు నటిస్తుంది. ఆ విషయం జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో స్పష్టమైంది. జమాతే ఇస్లామీ చాలాకాలంగా జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. తర్వాత ఆ సంస్థ బీజేపీతో కశ్మీర్‌లో చేతులు కలిపింది’’ అని పినరయి విజయన్ ఆరోపించారు.

ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ 3-4 స్థానాల్లో పోటీ చేయాలనుకుంది. కానీ చివరికి సిపిఎం నాయకుడు మొహమ్మద్ యూసుఫ్ తరిగామీ పోటీ చేసిన చోటనే బరిలోకి దిగింది అని గుర్తుచేసారు. ‘‘వాళ్ళ లక్ష్యం తరిగామీని ఓడించడం. బీజేపీ లక్ష్యం కూడా అదే. అందుకే బీజేపీ-అతివాదులు పొత్తు కుదుర్చుకున్నారు. అయినా ప్రజలు తరిగామీనే ఎంచుకున్నారు’’ అని పినరయి విజయన్ అన్నారు.

జమాతే ఇస్లామీ కశ్మీర్‌లో ఓ మాట, వయనాడ్‌లో మరోమాటా చెబుతోందంటూ ఆ సంస్థపై పినరయి మండిపడ్డారు. ‘‘ఏదేమైనా, మౌలికంగా వారి సిద్ధాంతం ఒకటే. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏ రూపంలోనూ అంగీకరించరు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు మద్దతు ఇస్తున్నారు’’ అని విజయన్ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న విజయన్, ‘‘లౌకికవాదం కోసం నిలబడిన వ్యక్తులు వేర్పాటువాదాన్ని అన్ని రూపాల్లోనూ వ్యతిరేకించాలి కదా’’ అని అడిగారు. ‘‘కాంగ్రెస్ ఆ పని చేయగలదా? కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ప్రధానంగా ముస్లింలీగ్, కొన్ని త్యాగాలు చేసైనా సరే జమాతే ఇస్లామీతో పొత్తు కొనసాగిస్తున్నాయి. జమాతే ఓట్లను కాంగ్రెస్ తిరస్కరించగలదా?’’ అని నిలదీసారు.

వయనాడ్‌లో సిపిఐ తరఫున పోటీ చేస్తున్న సత్యన్ మోకేరికి మద్దతుగా ప్రచారం చేసినప్పుడు కూడా విజయన్ ఇలాంటి ఆరోపణలే చేసారు. అక్కడ బీజేపీ తరఫున, కోళికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్ నవ్య హరిదాస్ పోటీ పడుతున్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయబరేలీ, వయనాడ్ రెండుచోట్లా పోటీచేసి రెండుచోట్లా గెలిచారు. ఆయన వయనాడ్ సీటును వదులుకోవడంతో అక్కడ నవంబర్ 13న ఉపయెన్నిక జరగనుంది.

Tags: andhra today newsJamat-e-IslamiNavya HaridasPinarai VijayanPriyanka GandhiRahul GandhiSathyan MokeriSLIDERTOP NEWSWayanad by-election
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.