నవంబరు 11 నుంచి 17 వరకు ఎంపిక చేసిన ఆలయాల్లో కార్యక్రమం
శివకేశవులకు ప్రతీకరమైన పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నవంబరు 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు ధార్మికోపన్యాసాలు ఉంటాయి. జిల్లాకు ఒక్క ఆలయాన్ని మాత్రమే ఎంచుకుంటరు.
ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు నిర్వహిస్తారు.జిల్లాకో శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం చేపట్టాలని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నిర్ణయించింది.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం చేస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు.