డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలిపోరులో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది.
ఓపెనర్ గా సంజూ శాంసన్ మరోసారి అదరగొట్టాడు. విధ్వంసక ఇన్నింగ్స్ తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు సాధించాడు. 7 ఫోర్లు, 10 సిక్సులతో సఫారీ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (7) నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (33) పరుగులు చేశారు. హార్దిక్(2), రింకూసింగ్ (11), అక్షర్ పటేల్ (7)వెంటనే పెవిలియన్ చేరారు.
చివర్లో భారత్ వెంటవెంటనే వికెట్లు నష్టపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లు తీయగా, మార్కో యన్సెన్ , కేశవ్ మహరాజ్ , పీటర్ , క్రూగర్ లు తలా ఒక వికెట్ తీశారు.
,
లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు విఫలమైంది. భారత బౌలర్లు దెబ్బకు 17.5 ఓవర్లలో అన్ని వికెట్లు నష్టపోయి 141 చేయగల్గింది. క్లాసెన్ (25) టాప్ స్కోరర్. మార్ క్రమ్ (8), ట్రిస్టన్ సబ్స్(11), రికిల్టన్(21), డేవిడ్ మిల్లర్ (18), పాట్రిక్ క్రూగర్(1), సిమెలన్(6), యాన్సెన్(12), కొయెట్జీ(23) పరుగులు చేశారు.
వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ ఒక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గబేరా వేదికగా జరగనుంది.