తితిదే తరహా పాలకమండలి ఏర్పాటు చేయాలని సూచన
యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
గోశాల సంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. కొండపై భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయడంతో పాటు ఆలయ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ చేయాలన్నారు.
మూసీ పునరుద్ధరణ పాదయాత్రలో భాగంగా నల్గొండకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం అయ్యారు.