ఆంధ్రప్రదేశ్ లో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టిన సీ ప్లేన్ ట్రయల్ రన్ ను విజయవంతమైంది.
విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి టేకాఫ్ తీసుకున్న ‘ సీ ప్లేన్’ విజయవంతంగా శ్రీశైలం వద్ద కృష్ణా జలాల్లో దిగింది. అక్కడ్నించి నీటిపైనే ప్రయాణిస్తూ శ్రీశైలంలోని బోటింగ్ జెట్టీ వద్దకు చేరింది. టూరిజం, ఎయిర్ ఫోర్స్, ఏపీ పోలీస్, ఎస్టీఆర్ఎఫ్ అధికారులు ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబరు 9న ‘సీ ప్లేన్’ ను విజయవాడ పున్నమి ఘాట్ నుంచి ప్రారంభిస్తారు. 14 సీట్ల సామర్థ్యం కల్గిన ఈ సీ ప్లేన్ ను డీ హవిల్లాండ్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ రూపొందించింది.