మహిళల ఆత్మగౌరవం పెంచేలా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపిందుకు సిద్దమైంది. మహిళల దుస్తులు పురుషులు కుట్టరాదని, మహిళల దుస్తులు కుట్టే ముందు కొలతలు మహిళలే తీసుకోవాలని, ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినన్నట్లు యూపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు.
ప్రస్తుతం తాము రూపొందించిన ప్రతిపాదనలు చట్టరూపం దాల్చితే మహిళలకు మరింత రక్షణ లభిస్తుందన్నారు. ఇక మహిళలకు జుట్టు కత్తిరించే పనులు మహిళలే చేయాలని ఇలా చేయడం వల్ల బ్యాడ్ టచ్ చేసే అవకాశాలను నిరోధించినట్లు అవుతుందని మహిళా కమిషన్ అభిప్రాయపడింది. యూపీ మహిళా కమిషన్ ప్రతిపాదనలు అందిన తరవాత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది.
యూపీ మహిళా కమిషన్ తయారు చేసిన ప్రతిపాదనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చట్ట రూపం దాల్చుతాయా లేదా? అనేది తేలాల్చి ఉంది. తమ అభిప్రాయలు, మహిళల నుంచి సేకరించిన సూచనలతో ప్రతిపాదనలు సిద్దం చేశామని త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామని యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ తెలిపారు.