సరస్వతి పవర్ కంపెనీకి చెందిన షేర్లను తనకు తెలియకుండా వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలకు బదిలీ చేశారంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నేషనల్ లా ట్రైబ్యునల్‌లో వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయడానికి విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాది 2 వారాల సమయం కోరారు. తదుపరి విచారణను లా ట్రైబ్యునల్ డిసెంబరు 13వ తేదీకి వాయిదా వేసింది.
సరస్వతీ పవర్ కంపెనీలో షేర్లను తన తల్లి తన అనుమతి లేకుండా బదిలీ చేసిందని, గిఫ్ట్‌గా ఇచ్చిన షేర్లను వెనక్కు తీసుకునేందుకు అనుమతించాలంటూ వైఎస్ జగన్ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తన తల్లి అక్రమంగా సోదరి రష్మిలకు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ.
ఈ కేసులో షర్మిల, విజయమ్మ, జనార్ధన్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీకి సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్లు కంపెనీకి సమర్పించకుండానే బదిలీ చేసుకున్నారని పిటిషన్లో తెలిపారు. బదిలీ చేసిన షేర్లు జగన్, భారతి, క్లాసిక్, రియాల్టీ పేర్లపై కొనసాగాలని ఆదేశించాలని జగన్ పిటిషన్లో కోరారు. తమకు 51.01 శాతం షేర్లు కొనసాగేలా ఆదేశించాలని కోరారు.