తప్పుడు సమాచారం అందిస్తోందంటూ కేంద్రం నోటీసులు జారీ చేసిందంటూ వచ్చిన వార్తలను వికీపీడియా ఫౌండేషన్ ఖండించింది. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేసింది. వికీపీడియాలో ఎడిట్ చేసుకునే సదుపాయం వల్ల తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ వేసింది.ఓ మీడియా సంస్థ వేసిన పిటిషన్పై విచారణ జరుగుతోంది. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే కంటెంట్ అప్ లోడ్ చేయాలంటూ వికీపీడియా కోరింది.
వికీపీడియా వాలంటీర్లు తప్పుడు సమాచారం అప్ లోడ్ చేయరని ఈ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మంది వాలంటీర్లు సమాచారం అప్ లోడ్ చేస్తున్నారని, తమకు భారత్ నుంచే ఎక్కువగా ఉన్నారని సంస్థ తెలిపింది. ప్రతి నెలా 8.5 కోట్ల వీక్షణలు వస్తున్నాయని, ఇటీవల చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సంస్థ తెలిపింది.
వికీపీడియా తటస్థ నిబంధనలను అనుసరిస్తుందని, రాజకీయ నేపథ్యం ఉన్న వేలాది వాలంటీర్లు సంస్థలో భాగమై ఉన్నారని తెలిపారు. ఏ వ్యాసమైనా పూర్తి సమాచారంతో అందిస్తారని, అంతేకాకుండా ఆ సమాచారానికి సంబంధించిన సోర్స్ లింకులు కూడా అందుబాటులో ఉంచుతామని వికీపీడియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. వికీపీడియాలో కంటెంట్ ఎవరైనా ఎడిట్ చేసుకునే సదుపాయం ఉండటంతో తప్పుడు సమాచారం ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి తెలిసిన విషయాన్ని వారు అప్ లోడ్ చేస్తూ నిజాలను వక్రీకరిస్తున్నారనే కేసులు అనేకం నమోదయ్యాయి.
వికీపీడియా భారత్ సహా పలు దేశాల్లో న్యాయసంబంధమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వికీపీడియాకు ప్రత్యేకంగా కంటెంట్ రైటర్లు అంటూ ఎవరూ ఉండకపోవడం, ఎవరైనా వారికి తెలిసిన సమాచారం అప్ లోడ్ చేసుకునే సదుపాయం ఉండటం నిజాల వక్రీకరణకు దారితీస్తోందనే విమర్శలు వస్తున్నాయి.