బెదిరింపు కాల్స్ బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. సల్మాన్ వ్యవహారం మరువకముందే మరో అగ్రనటుడు షారుక్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. కోట్లాది రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
షారుక్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన వ్యవహారాన్ని బాంద్రా పోలీసులు బయటపెట్టారు. కోట్లాది రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ రాయపూర్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఆ దుశ్చర్యకు దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం వేట మొదలుపెట్టారు.
సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణ జరుగుతుండగానే మరో నటుడికి బెదిరింపులు రావడం చర్చకు దారితీసింది.