జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అధికార, విపక్ష సభ్యులు ఇద్దరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇంజనీర్ రషీద్ సోదరుడు ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ 370 ఆర్టికల్‌ను పునరుద్దరించాలంటూ అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించడంతో
బీజేపీ నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరవాత ఇద్దరూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. మార్షల్స్ ఇద్దరినీ విడదీశారు. సభ అదుపుతప్పడంతో కాసేపు స్పీకర్ వాయిదా వేశారు.
370 ఆర్టికల్, 32ఏ పునరుద్దరించాలంటూ పీడీపీ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది.
రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ పీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి ఇవ్వాలంటూ బుధవారంనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది.దీనిపై కూడా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాక్, ఉగ్రవాదులతో చేతులు కలిపిందని రైనా విరుచుకుపడ్డారు.