అక్బరుద్దీన్ ఒవైసీ అనగానే గుర్తొచ్చేది 2012లో అతను చేసిన ‘15 నిమిషాలు పోలీసులని తప్పించండి… ఏం జరుగుతుందో చూడండి’ అన్న రెచ్చగొట్టే వ్యాఖ్య. నిన్న బుధవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యని మరోసారి గుర్తు చేసాడు.
అక్బరుద్దీన్ బుధవారం రాత్రి శంభాజీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అప్పటికి సమయం రాత్రి 9.45 అయింది. మరో పదిహేను నిమిషాల్లో ప్రచారం ముగించేయాలి. ఆ సమయంలో అక్కడున్న జనాలని ఉద్దేశించి, ‘‘ఇంకా పదిహేను నిమిషాలు సమయం ఉంది. సహనంగా ఉండండి. తను (సమయం) నన్ను వదలడం లేదు, నేను తనని వదలను. తను ఇంకా నడుస్తూనే ఉంది. కానీ దాని ప్రతిధ్వని ఏమిటి?’’ అని మాట్లాడాడు.
హిందూజాతి మొత్తాన్నీ హననం చేసేస్తానంటూ గతంలో చేసిన ‘పోలీసులను 15 నిమిషాలు వదిలేయండి’ అన్న వ్యాఖ్యని గుర్తుచేసేలా అక్బరుద్దీన్ సైగలు చేసాడు. దాంతో ముస్లిం జనాలు కిర్రెక్కిపోయారు. చప్పట్లు, కేరింతలు కొట్టారు. కొంతమంది అయితే ‘పదిహేను నిమిషాలు, పదిహేను నిమిషాలు’ అంటూ కేకలు వేసారు.
ఏమిటా అక్బరుద్దీన్ వివాదాస్పద ప్రసంగం?
అక్బరుద్దీన్ ఒవైసీ 2012లో హిందువులపై విద్వేషాన్ని కురిపిస్తూ, హిందువులకు వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొడుతూ బహిరంగ ప్రసంగం చేసాడు. ఆ ప్రసంగంలో హిందూ దేవీదేవతల మీద నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసాడు. పోలీసుల అండ లేకుండా పావుగంటైనా బతకలేరంటూ బహిరంగంగా సవాల్ విసిరాడు. పదిహేను నిమిషాల పాటు పోలీసులని తప్పించండి, ఏం జరుగుతుందో చూస్తారు అంటూ తొడకొట్టాడు. అంతేకాదు, నరేంద్రమోదీ ప్రధానమంత్రి ఎలా అవుతాడో చూస్తానంటూ బీరాలు పలికాడు.
‘‘ఎందరో మోదీలు వచ్చారు, పోయారు. ఇవాళ జనాలు గుజరాత్‌లో మోదీ గెలిచాడంటున్నారు. ఏదో ఒకరోజు మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడంటున్నారు. అది ఎలా జరుగుతుందో మేమూ చూస్తాం. మాకు మోదీ ఉన్నాడంటూ ముస్లిములను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవడా మోదీ? ఎక్కణ్ణుంచి వచ్చాడు, దమ్ముంటే ఒకసారి హైదరాబాద్ రమ్మనండి. మా తాకత్ ఏంటో చూపిస్తాం’’ అన్నాడు అక్బరుద్దీన్.
‘‘తస్లీమా నస్రీన్ హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఓ హిందుస్తాన్, మేం 25కోట్ల మందిమి ఉన్నాం. మీరు వందకోట్ల మంది ఉన్నారు కదా. సరే. మాకంటె మీ సంఖ్య చాలా ఎక్కువ కదా. ఒక పావుగంట పోలీసులని పక్కన పెట్టండి. ఎవరు ఎక్కువ బలవంతులో తేల్చుకుందాం’’ అన్నాడు. వేల సంఖ్యలో ఆ సమావేశానికి హాజరైన ముస్లిములు చప్పట్లతో హోరెత్తించారు, హుషారుగా అరుపులు, కేకలు పెట్టారు. ‘’15 నిమిషాలు పోలీసులను తీసేయండి. వెయ్యి మంది, లక్ష మంది లేదా కోటిమంది అయినా సరే, నపుంసకులైన హిందువులు సమష్టిగా ప్రయత్నించినా ఒక్కరిని కూడా బతికించలేరు. వీళ్ళకు మనను ముఖాముఖి చూసే ధైర్యమే లేదు. ముస్లిములు బలహీనులు అయినప్పుడే ఈ నపుంసకులు రాగలరు’’ అంటూ హిందువులపై విద్వేషాన్ని రంగరించి ప్రసంగించాడు అక్బరుద్దీన్ ఒవైసీ.
ఆ ప్రసంగంలోనే అక్బరుద్దీన్ ఒవైసీ అప్పటికింకా పరిష్కారం కాని రామజన్మభూమి కేసు గురించి మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి గురించి, ఆయన తల్లి కౌసల్యాదేవి గురించీ అవమానకరంగా దూషించాడు.
‘‘ప్రతీ వంద కిలోమీటర్లకూ భాష మారిపోతుందంటారు, సంస్కృతి మారిపోతుందంటారు, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పద్ధతులూ అన్నీ మారిపోతాయని వారు చెబుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ దేవుళ్ళ రూపాలు కూడా మారిపోతుంటాయి. ఎంత హాస్యాస్పదమో కదా’’ అని జూనియర్ ఒవైసీ హిందువుల బహుళ దేవతారాధన ప్రక్రియను అపహాస్యం చేస్తూ మాట్లాడాడు.
హిందువులను అవమానిస్తూ, అపహాస్యం చేస్తూ, హిందువులపై ద్వేషాన్ని పెంచేలాంటి వ్యాఖ్యలు చేసిన 2012 నాటి అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం మీద రెండు విద్వేష ప్రసంగం కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసులనూ హైదరాబాద్ కోర్టు 2022లో కొట్టేసింది. ఇదీ హిందూదేశంలో హిందువులను నిందించేవారికి దక్కే ఆదరణ. ఆ ధైర్యంతోనే ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఆ పాత ’15 నిమిషాలు పోలీసులను పక్కన పెట్టండి…’ అనే వ్యాఖ్యలను గుర్తుచేస్తూ పరోక్షంగా హిందువులను సర్వనాశనం చేస్తామని సంకేతాలు ఇస్తున్నాడు అక్బరుద్దీన్ ఒవైసీ.