అమెరికాను కార్చిచ్చు మరోసారి వణికిస్తోంది. కాలిఫోర్నియాలో మొదలైన కార్చిచ్చు బలమైన గాలుల వల్ల వేగంగా విస్తరిస్తోంది. కాలిఫోర్నియా సమీపంలో మొదలైన కార్చిచ్చు 5 గంటల వ్యవధిలోనే కి.మీ విస్తీర్ణం నుంచి 62 కి.మీ విస్తీర్ణానికి వ్యాపించింది. అధికారులు అప్రమత్తమయ్యారు. 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొగ కారణంగా ఏమీ కనిపించకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలుస్తోంది.
కాలిఫోర్నియా నగరాన్ని కూడా పొగ చుట్టుముట్టింది. 14 వేల మందిని ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 3 వేల ఇళ్లు తగలబడిపోయాయి. వందలాది కార్లలో జనం ఇళ్లు వదలి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.మంటలు ఆర్పేందుకు హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు.
అమెరికాలో కార్చిచ్చులు కొత్తేమీ కాదు. అయితే ఇటీవల కాలంలో కార్చిచ్చులు ఎక్కవయ్యాయని అధికారులు చెబుతున్నారు. పర్యావరణంలో వేడి పెరిగిపోవడం, వేగంగా గాలులు వీయడం వంటి కారణాలతో కార్చిచ్చు వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఆర్పేందుకు చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. దీంతో భారీ నష్టం తప్పడం లేదు.